HomeTelugu Trendingచిక్కుల్లో అడవి శేషు!

చిక్కుల్లో అడవి శేషు!

Adivi sesh 2 states movieటాలీవుడ్ న‌టుడు అడివిశేష్ కొంతకాలం క్రితం ‘2 స్టేట్స్’ సినిమాకు సైన్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన కొంత‌భాగం షూటింగ్‌ పూర్త‌యింది. అయితే ఈ ప్రాజెక్టుకు చిక్కులు వ‌చ్చిన‌ట్టు ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. 2స్టేట్స్ నిర్మాత, ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ఎంఎల్‌వీ స‌త్య‌నారాయ‌ణ ఈ సినిమాకు సంబంధించి అడివి శేష్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చార‌ట‌. అయితే కొన్ని సృజనాత్మ‌క విభేధాల కార‌ణంగా అడివి శేష్ ఈ సినిమాను ప‌క్క‌న‌పెట్టి మేజ‌ర్ మూవీ షూటింగ్ తో బిజీ అయ్యాడు.

ప్ర‌స్తుతం ఈ సినిమాపై అడివిశేష్ కు ఆస‌క్తిలేక‌పోవ‌డంతో వేరే సినిమాల‌తో బిజీ అయిపోయాడు. దీంతో త‌న సినిమాకు సంబంధించి లీగ‌ల్ రూట్‌లో వెళ్లాల‌ని అనుకుంటున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఒక‌వేళ లీగ‌ల్ రూట్ లో వెళ్తే నిర్మాత‌కే ఎక్కువ‌గా మేలు జ‌రిగే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తోంది. వెంక‌ట్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాలీవుడ్ ప్రాజెక్టు 2 స్టేట్స్ కు తెలుగు రీమేక్‌. శివానీ రాజ‌శేఖ‌ర్ హీరోయిన్ గా న‌టించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu