HomeTelugu Trending'థ్యాంక్ యు బ్రదర్' అనసూయ ఫస్ట్‌లుక్‌

‘థ్యాంక్ యు బ్రదర్’ అనసూయ ఫస్ట్‌లుక్‌

Thank you brother first l
అనసూయ ప్ర‌ధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్ యు బ్రదర్‌. రానా ఈ సినిమా టైటిల్‌ లుక్‌ని విడుదల చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశాడు. చెప్పినట్టే.. ఓ ఆసక్తికరమైన లుక్‌ని సాయితేజ్‌ రివీల్‌ చేశారు. సాయితేజ్‌ వదిలిన థ్యాంక్‌ యు బ్రదర్‌ ఫస్ట్ లుక్‌లో గర్భవతిగా కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చారు. గ్లామర్‌తో హాట్‌గా కనిపించే ఈ బ్యూటీ ఈ సినిమాలో ప్రెగ్నెంట్‌ లేడీగా. కానీ వైవిధ్యమైన పాత్ర చేయడంలో ఈమె ఎప్పుడూ రెడీగానే ఉంటుంది.

ఇక ఈ పోస్ట‌ర్‌లో ఒక లిఫ్ట్‌లో ప్ర‌ధాన పాత్ర‌ధారి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్రెగ్నెంట్ లుక్‌లో, చేతిలో ఫేస్ మాస్క్ ప‌ట్టుకొని కోపంగా చూస్తున్న‌ట్లు క‌నిపిస్తుంటే, ఆమె వెన‌కే మ‌రో ప్ర‌ధాన పాత్ర‌ధారి అశ్విన్ విరాజ్ సీరియ‌స్ లుక్‌లో నిల‌బ‌డి క‌నిపిస్తున్నారు. ఒక‌రి వెనుక ఒక‌రు నిల్చొని, ప‌ర‌స్ప‌రం చూసుకుంటున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మేష్ రాప‌ర్తి రూపొందిస్తున్నారు. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu