HomeTelugu Trendingఅడవి శేష్‌ 'మేజర్‌' ఫస్ట్‌లుక్‌

అడవి శేష్‌ ‘మేజర్‌’ ఫస్ట్‌లుక్‌

Adivi Sesh Major First Loటాలీవుడ్‌ నటుడు అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ సందీప్‌ ఉన్ని కృష్షన్‌ జీవితం ఆధారంగా‌ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ రోజు అడవి శేష్‌ పుట్టినరోజు సంద‌ర్భంగా`మేజర్` ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు‌. ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు ‘మేజర్’ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌ చేశారు.

కాగా ఈ సినిమా యూనిట్‌ ఆగష్టులో కోవిడ్ నేపధ్యంలో అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ 70శాతం షూట్ పూర్తి చేసింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషలలో రూపొందుతుంది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న మేజర్ చిత్రాన్ని 2021 స‌మ్మ‌ర్‌ కు ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu