‘అజ్ఞాతవాసి’ టీజర్ వచ్చేసింది!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.  పవన్ కళ్యాన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి’ టీజర్ కొద్ది సేపటి క్రితం వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ‘మధురాపురి సదనా…మృదు వధనా..మధు సూదనా.. ఇల స్వాగతం’ అంటూ వస్తున్న పాట చూస్తుంటే ‘అత్తారింటికి దారేది’లో పవన్ కళ్యాన్ ‘దేవ దేవం’ పాట గుర్తుకు వస్తుంది. ఇక పవన్ చేస్తున్న ఫైట్స్, కామెడీ చూస్తుంటే సినిమా లో నవరసాలు మేళవించినట్లు కనిపిస్తుంది. 

సినిమాలో అందరు నటులు కవర్ అయ్యారు..ఒక్క ఖుష్బూ తప్ప.  చివరిగా…‘వీడి చర్యలు ఊహాతీతం..వర్ణాతీం..దటీజ్ దా బ్యూటీ’ అంటూ టీజర్ ముగిసింది. ఈ టీజర్ లో త్రివిక్రమ్ మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాన్ ని ఎలా చూపించాలో అన్ని అంశాలు ఈ టీజర్ లో చూపించినట్లు కనిపిస్తుంది.