ఐశ్వర్య సినిమాకు సైన్ చేసింది!

మొన్నామధ్య ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలో నటించిన ఐశ్వర్యరాయ్.. ఆ తరువాత మణిరత్నం సినిమాలో నటించడానికి అంగీకరించిందంటూ.. వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె ఓ హిందీ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు అనీల్ కపూర్ హీరోగా నటించనున్న సినిమా కోసం ఐష్ ను సంప్రదించగా ఆమె నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెరకెక్కించనున్నారు. దీనికి ‘ఫ్యానీ ఖాన్’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్, అందులో తన పాత్ర ఐష్ ను ఆకట్టుకోవడంతో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, దర్శకుడు రాకేశ్ ఓంప్రకాష్ గతంలో ‘మీర్జ్యా’, ‘ఢిల్లీ 6’ వంటి చిత్రాలను తీయగా… తాజాగా ‘మేరె ప్యారే ప్రైం మినిస్టర్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఐష్ సినిమా పట్టాలెక్కించనున్నాడు.