HomeTelugu TrendingAishwarya rajinikanth: ధనుష్‌ వల్లే సినిమాల్లోకి వచ్చిన అనిరుధ్‌

Aishwarya rajinikanth: ధనుష్‌ వల్లే సినిమాల్లోకి వచ్చిన అనిరుధ్‌

Aishwarya rajinikanth about

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకురాలిగా సక్సెస్ అయ్యేందుకు ట్రై చేస్తునే ఉంది. కానీ ఆమెకు మాత్రం సరైన సక్సెస్ రావడం లేదు. ఇటీవలే లాల్ సలామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐశ్వర్య.. పెద్దగా మెప్పించలేక పోయింది. ఈ సినిమాలో రజినీకాంత్‌ స్పెషల్ అప్పియెరెన్స్ పాత్రను చేయించుకుంది. అయినా ఫలితాన్ని మాత్రం తెచ్చుకోలేకపోయింది.

పైగా రజినీ రాకతోనే స్క్రిప్ట్ మొత్తం మారిపోయిందని, తన కంట్రోల్‌లో లేకుండా పోయిందని చెబుతోంది. అంతే కాకుండా చివర్లో తాను సినిమా పుటేజ్ మొత్తం పోయిందని, ఉన్నదాంట్లోనే అడ్జస్ట్ చేసి సినిమాను పూర్తి చేశానని అంటోంది. ప్రస్తుతం ఐశ్వర్య మాటలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇక అనిరుధ్ మరియు ధనుష్ కాంబో గురించి కూడా ఐశ్వర్య చెప్పుకొచ్చింది.

అనిరుధ్ తమకు రిలేటివ్ అవుతాడని, ముందుగా ధనుష్ అతడి టాలెంట్‌ను గుర్తించాడని చెప్పుకొచ్చింది. మామూలుగా అనిరుధ్ బయటకు వెళ్లి ఏదో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలని అనుకున్నాడట. కానీ ధనుష్ మాత్రం అనిరుధ్ టాలెంట్ మీద నమ్మకంగా ఉండేవాడట. అందుకే త్రీ సినిమాలో ఛాన్స్ ఇచ్చామని చెప్పుకొచ్చింది. అలా సినిమాల్లోకి అనిరుధ్‌ను తీసుకొచ్చిందని ధనుష్.

అంతా అతడి వల్లే జరిగింది. కానీ ఈ రోజు అనిరుధ్ తన కష్టంతో ఈ స్థాయికి వచ్చాడు.. అనిరుధ్‌ను చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలు ధనుష్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఎంతో నిజాయితీగా చెప్పిందంటూ ప్రశంసిస్తున్నారు. ధనుష్, అనిరుధ్ మ్యూచువల్ ఫ్యాన్స్ సైతం ఈ వీడియోనుతెగ షేర్ చేస్తున్నారు.

2004లో ధనుష్, ఐశ్వర్యల వివాహాం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇద్దరూ కుమారులున్నారు. ఇక 2022లో ధనుష్, ఐశ్వర్యలో పరస్పర అంగీకారంతో విడిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ వీరిద్దరూ కలుస్తారంటూ అప్పుడప్పుడు కోలీవుడ్‌లో రూమర్లు వినిపిస్తుంటాయి.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!