HomeTelugu Big Stories'అఖండ' టైటిల్‌ సాంగ్‌ విడుదల

‘అఖండ’ టైటిల్‌ సాంగ్‌ విడుదల

Akhanda Title Song Lyrical

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం‘అఖండ’. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇక అఘోరగా బాలకృష్ణ గెటప్ అదరహో అన్నట్టుగా ఉంది. ఆ గెటప్ మీద చిత్రీకరించిన ‘భం అఖండ, భం భం అఖండ’ అనే టైటిల్ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ వీడియో వైరల్ అవుతుంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ గీతాన్ని తన కుమారులు సిద్ధార్థ్‌, శివమ్ తో కలిసి శంకర్ మహదేవన్ ఆలపించారు. ఎస్. ఎస్. తమన్ సంగీతం అందించారు. చిత్రీకరణ సైతం అదే తరహాలో సాగిందనేది ఈ లిరికల్ వీడియో మధ్యలో మెరుపులా వచ్చిన మేకింగ్ విజువల్స్ చూస్తుంటే అర్థమౌతోంది. ‘సింహా, లెజెండ్’ విజయాలను మరిపించేలా ‘అఖండ’ను తెరకెక్కించడానికి బోయపాటి పడుతున్న శ్రమ ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్ ఓ కీలకమైన పాత్రను పోషించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu