మరోసారి మహేష్ తో చందమామ!

తెలుగు సినిమా పరిశ్రమలో కాజల్ పనైపోయిందనుకున్న వారందరికీ వరుసగా పవన్ కల్యాణ్, చిరంజీవి సరసన అవకాశాలు సాధించి ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు మహేష్ బాబు సరసన కూడా నటించబోతోందని టాక్. గతంలో మహేష్ బాబు, కాజల్ కలిసి బిజినెస్ మెన్, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి మహేష్ తో జత కట్టబోతోంది.

మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని పీవీపీ బ్యానర్ లో నిర్మిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ సినిమా దిల్ రాజు చేతుల్లోకి వెళ్ళినట్లు సమాచారం. మహేష్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తరువాతే
వంశీ పైడిపల్లి సినిమా మొదలవుతుంది.