షూటింగ్ లో పాల్గొనున్న అఖిల్!

అఖిల్ షూటింగ్ అంటే సినిమా కోసం అనుకోకండి.. అదొక యాడ్ ఫిల్మ్ షూటింగ్. ప్రస్తుతం ఒక వైపు అఖిల్ రెండవ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. అలానే తన నిశ్చితార్ధం పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. అయితే అఖిల్ చాలా కాలంగా ‘మౌంటెన్ డ్యూ’కి బ్రాండ్  అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించి మరొక యాడ్ ను చేయడానికి అఖిల్ ‘మడ్ ఐలాండ్’ కు వెళ్ళినట్లు తెలుస్తోంది.

భారీ యాక్షన్ సీన్ తో ఈ యాడ్ ను రూపొందిస్తున్నట్లు సమాచారం. అక్కడ నుండి అఖిల్ తిరిగి వచ్చిన తరువాత డిసంబర్ 9న ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భూపాల్ తో నిశ్చితార్ధం జరపనున్నారు. ఆ తరువాత వారంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఆయన చేయబోయే సినిమాను ప్రారంభించి.. రెగ్యులర్ షూటింగ్ జరపనున్నారు.