నివేదా థామస్ కు నిరాశ తప్పదా!

ఈ మధ్య కాలం వచ్చిన సినిమాల్లో అటు గ్లామర్ పరంగా ఇటు నటన పరంగా ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్ నివేదా థామస్. ‘జెంటిల్ మెన్’ సినిమాలో నానికి పోటీగా నటించి మంచి కాంపిటీషన్ ఇచ్చింది. సినిమా కూడా హిట్ కావడంతో అమ్మడుకి యూత్ క్రేజ్ పెరిగిపోయింది. అయితే గత కొద్ది రోజులుగా నివేదాకు ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. కెరీర్ ఆరంభంలోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో కలిసి పని చేసే ఛాన్స్ రావడంతో ఆమె కెరీర్ ఊపందుకోవడం ఖాయమని భావించారు.

కానీ ఇప్పుడు ఆ అవకాశం ఆమెకు దక్కుతుందో.. లేదో అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిఖన్నాను మాత్రమే తీసుకున్నట్లుగా కల్యాణ్ రామ్ చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ సరసన నివేదాను చూడాలనుకున్న అభిమానులకు నిరాశ ఎదురయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా నివేదాను తీసుకుంటారో.. లేక పక్కన పెట్టేస్తారో.. చూడాలి!