HomeTelugu Trendingఅజయ్‌ భూపతి డైరెక్షన్‌ అఖిల్‌

అజయ్‌ భూపతి డైరెక్షన్‌ అఖిల్‌

Akkineni Next Movie With Aj
అక్కినేని అఖిల్‌ హీరోగా.. సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో ‘ఏజెంట్‌’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకి సంబంధించి అఖిల్ లుక్‌ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో అతడు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఓ చిత్రంలో అఖిల్‌ నటించనున్నాడట. ఈ చిత్రానికి అజయ్‌ భూపతి దర్శకత్వం చేయనున్నారనే వార్తలొస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అఖిల్ – పూజాహెగ్డే కలిసి జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 19న విడుదల కానుంది. మరోవైపు అజయ్‌ భూపతి ‘మహాసముద్రం’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా నటిస్తుండగా, అతిదిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!