సమంత పిక్‌తో నెటిజన్లు ఫిదా

స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత “శాకుంతలం” చిత్రంతో బిజీగా ఉంది. హైదరాబాద్‌లో “శాకుంతలం” రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత శకుంతలగా కనిపిస్తుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటిస్తుండటంతో అంచనాలు మరింత పెంచేశాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. సమంత దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ తన సత్తా చూపుతోంది. సమంత సౌత్‌లో ఓ స్టయిల్ ఐకాన్. తన ఫ్యాషన్ అభిరుచితో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తూ ఉంటుంది సమంత. ఈ ఫ్యాషన్ క్వీన్ తాజాగా షేర్ చేసిన ఓ పిక్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. తన అందంతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్‌కు గంటల వ్యవధిలోనే లక్షల్లో లైకులు, భారీ సంఖ్యలో షేర్లు రావడం విశేషం.

CLICK HERE!! For the aha Latest Updates