HomeTelugu Newsఆమే నాకు ఇష్టమైన హీరో : సమంత

ఆమే నాకు ఇష్టమైన హీరో : సమంత

8 23ప్రముఖ నటి సమంత బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ నటనను ప్రశంసించారు. తాజాగా ‘మణికర్ణిక’ చిత్రాన్ని చూసిన సామ్‌ తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. కంగన తన నటనతో హృదయాల్ని గెలుచుకున్నట్లు చెప్పారు. ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’.. ‘కంగనా రనౌత్:‌ ది ఫ్రీకింగ్‌ (సర్‌ప్రైజ్‌) క్వీన్‌ ఆఫ్‌ అవర్‌ హార్ట్స్‌’.. ఆమే నాకు ఇష్టమైన హీరో’ అని సామ్‌ పోస్ట్‌ చేశారు. క్రిష్‌ ‘మణికర్ణిక’ సినిమాకు దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్‌ సంస్థ నిర్మించింది. విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు కంగన దర్శకత్వం వహించారు. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది.

కాగా సమంత ప్రస్తుతం ‘మజిలీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సామ్‌ తమిళంలో నటించిన ‘సూపర్‌ డీలెక్స్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ఆమె హంతకురాలి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క సామ్‌, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘ఓ బేబీ ఎంత సక్కగున్నావే’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu