HomeTelugu Trendingరవితేజ 'రావణాసుర' లో సుశాంత్‌.. ఫస్ట్‌లుక్‌ విడుదల

రవితేజ ‘రావణాసుర’ లో సుశాంత్‌.. ఫస్ట్‌లుక్‌ విడుదల

Akkineni sushanth first loo

రవితేజ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఖిలాడీ, రామారావు ఆన్‌ డ్యూటీతోపాటు సుధీర్‌ వర్మ డైరెక్షన్‌తో ‘రావణాసుర’ చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయగా జనవరి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లకు మంచి స్పందన వచ్చింది. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా, శ్రీకాంత్‌ విస్సా కథ అందించారు. ఈ సినిమాలో రవితేజ లాయర్‌ పాత్రతో పాటు పది గెటప్‌లలో అలరించనున్నాడని టాక్‌. పలు ఆసక్తికర అంశాలతో మూవీ అప్‌డేట్స్‌ ఇస్తున్నారు మేకర్స్‌.

తాజాగా ఈ సినిమాలోని మరో పాత్రను పరిచయం చేసింది చిత్రబృందం. ఇందులో యంగ్‌ హీరో అక్కినేని సుశాంత్‌ కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌.. రామ్‌ పాత్రలో అలరించనున్నట్లు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఆ ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే సుశాంత్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రెడ్‌ అండ్‌ బ్లాక్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో లాంగ్‌ హెయిర్‌తో ఇంటెన్సివ్‌ లుక్‌లో కనిపించాడు సుశాంత్‌. అలాగే ఈ మూవీలో అందాల తార దక్షా నాగర్కర్‌ విలన్‌గా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!