అక్షయ్ కుమార్ బెల్‌బాటమ్‌పై కీలక ప్రకటన

అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం బెల్‌బాట‌మ్‌. ఈ చిత్రం మే నెల‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుద‌ల కాబోతుంద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. త‌మ ఫేవ‌రేట్ హీరో అక్ష‌య్‌ కుమార్ సినిమా ఓటీటీలో రాబోతుంద‌ని అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. స్పై థ్రిల్ల‌ర్ గా వ‌స్తున్న ఈ చిత్రానికి రంజిత్ ఎం తివారీ ద‌ర్శ‌కుడు. వాణీక‌పూర్, హుమా ఖురేషి, లారా ద‌త్తా ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఎంట‌ర్టైన్‌మెంట్స్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
బెల్‌బాట‌మ్ మూవీని ఓటీటీలో విడుద‌ల చేయడం లేదని స్పష్టం చేసింది. ఓటీటీలో విడుదలవుతుందనే వార్తలు అవాస్తవమని తెలిపింది. సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటన అయినా నిర్మాణ సంస్థ ద్వారానే వస్తుందని వెల్లడించింది. ధర్డ్‌ పార్టీ లేదా నటుల ద్వారా ప్రకటన ఉండబోదని తెలిపింది.

CLICK HERE!! For the aha Latest Updates