
Akshay Kumar Operation Sindoor:
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. కారణం – ఆయన చేసిన ఓ ట్వీట్. మే 7, 2025న అక్షయ్ తన X (ట్విట్టర్) అకౌంట్‌లో “Jai Hind.. Jai Mahakaal” అని రాసి, ఆపరేషన్ సింధూర్‌పై ఒక పెద్ద ఫోటో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన తర్వాత, అతను ఏకంగా 4.2 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కోల్పోయాడు!
ఇది సాధారణ విషయం కాదని చెప్పాలి. ఒకే రోజులో మిలియన్ల మంది అన్‌ఫాలో చేయడం పక్కా ప్లానింగ్‌తో జరిగిందనే చెప్పాలి. ప్రత్యేకంగా పాకిస్తాన్ నుండి వచ్చిన ఫాలోవర్లు అతన్ని మాస్‌గా అన్‌ఫాలో చేశారని సోషల్ మీడియా విశ్లేషకులు చెబుతున్నారు.
Jai Hind 🇮🇳
Jai Mahakaal 🚩 pic.twitter.com/h7Z6xJAklH— Akshay Kumar (@akshaykumar) May 7, 2025
అక్షయ్‌తో పాటు అలియా భట్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ వంటి మరికొంతమంది సెలబ్రిటీలు కూడా ఫాలోవర్లను కోల్పోయారని సమాచారం. పాహల్‌గాం టెర్రర్ అటాక్ తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్ కళాకారుల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయడంతో ఈ పరిణామాలు ప్రారంభమయ్యాయి.
ఇక పాకిస్తాన్ నటులు మహీరా ఖాన్, ఫవాద్ ఖాన్, హనియా ఆమీర్ వంటి వారు ఇండియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “దీనిని క్షమించలేం” అని ట్యాగ్‌లతో పోస్టులు పెట్టారు. దీనికి ప్రతిస్పందనగా భారత అభిమానులు పాకిస్తానీ నటులను అన్ ఫాలో చేశారు.
ALSO READ: 1971లో విడుదలై అత్యధిక టికెట్లు అమ్మిన Bollywood Movie ఇదే అని మీకు తెలుసా?