HomeTelugu Trendingభార్యకు అరుదైన గిఫ్ట్‌ ఇచ్చిన అక్షయ్‌

భార్యకు అరుదైన గిఫ్ట్‌ ఇచ్చిన అక్షయ్‌

4 11
ప్రస్తుతం దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. ఉల్లి దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా పెరుగుతున్న ఉల్లి ధరలపై పలువురు వ్యంగ్యంగా నిరసన తెలియజేస్తున్నారు. కొందరు ఉల్లిని బంగారంతో పోల్చితే.. మరికొందరు ఉల్లిని పెళ్లి కానుకగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్‌ హీరో తన భార్యకు ఉల్లితో అలంకరించిన ఇయర్‌ రింగ్స్‌ను ప్రేమతో గిఫ్ట్‌గా ఇచ్చాడు. వాటిని స్వీకరించిన ఆమె కూడా గిఫ్ట్‌ చాలా బాగుందని పొగడటం విశేషం. వాటికి సంబంధించిన ఫొటోలను ఆ నటి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నటించిన చిత్రం ‘గుడ్‌న్యూస్’. ఇందులో అక్షయ్‌కు జంటగా కరీనా కపూర్‌ నటించారు. కియారా అడ్వాణీ, దిల్జిత్‌ దొసాంజ్‌ కీలక పాత్రలు పోషించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అక్షయ్‌కుమార్‌ ‘గుడ్‌న్యూస్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ది కపిల్‌ శర్మ షోకు హాజరయ్యారు. అయితే ఆ షోలో ఆనియన్‌ ఇయర్‌ రింగ్స్‌ను కరీనాకు చూపించారు. ఆ ఇయర్‌ రింగ్స్‌ ఆమెకు అంతగా నచ్చలేదు. దీంతో అక్షయ్‌ వాటిని ఇంటికి తీసుకువచ్చి తన సతీమణి ట్వింకిల్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని ట్వింకిల్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు తెలిపారు.

‘కపిల్‌ శర్మ షోలో ప్రమోషన్స్‌ నుంచి ఇంటికి వచ్చిన నా భర్త వీటిని నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. కరీనాకు నచ్చకపోవడంతో నీ కోసమే వాటిని తీసుకువచ్చాను అని ఆయన నాతో చెప్పారు. కొన్నిసార్లు ఇలాంటి చిన్న, సరదా విషయాలే మన హృదయాలను హత్తుకుంటాయి. ఆనియన్‌ ఇయర్‌రింగ్స్‌, బెస్ట్‌గిఫ్ట్‌’ అని ట్వింకిల్‌ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!