అక్షయ్ పాత్రపై రజిని ఆసక్తి!

రజినీకాంత్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘రోబో’ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం ‘రోబో 2’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను నిన్ననే రిలీజ్ చేశారు.. ఈ పోస్టర్స్ లో రజినీకాంత్, అక్షయ్ కుమార్ ల లుక్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ముంబైలో జరిగిన ఈ వేడుకలో రజినీకాంత్ ‘శంకర్ గొప్ప దర్శకుడనీ.. ఆయనతో పని చేయడం చాలా కష్టమని అన్నారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే దిశగా శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించారని చెప్పారు. అంతేకాదు తనని తాను ౩డీ లో చూసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పారు.

ఈ సినిమాలో హీరో నేను కాదని.. అక్షయ్ అని చెప్పి తన గొప్ప మనసుని చాటుకున్నారు. శంకర్ గనుక పాత్రలను ఎన్నుకునే అవకాశం నాకు ఇస్తే.. నేను అక్షయ్ రోల్ లో నటిస్తానని చెప్పేవాడినని అక్షయ్ పాత్ర పట్ల తన ఆసక్తిని వెల్లడించారు. దీంతో అందరిలోనూ ఈ సినిమాపై ముఖ్యంగా అక్షయ్ కుమార్ పాత్ర పట్ల మరింత ఆసక్తి పెరిగింది.