HomeTelugu Trendingకాస్త విరామం దొరికితే అదే చేస్తా..!

కాస్త విరామం దొరికితే అదే చేస్తా..!

1 111 11బాలీవుడ్‌ నటి నిధి అగర్వాల్‌ హైదరాబాద్‌లో సందడి చేసింది. ప్రముఖ టైర్ల బ్రాండ్‌ ఎఆర్‌ఎల్‌ టైర్స్‌ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ది పార్క్‌ హోటల్‌లో జీతో షాన్‌ సే కార్యక్రమాన్ని నిధిఅగర్వాల్ ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ టాలీవుడ్‌లో తాను నటించిన గత రెండు చిత్రాలతో పోలిస్తే త్వరలో విడుదల కానున్న ఇస్మార్ట్‌ శంకర్‌ తనకెంతో ప్రత్యేకత అని చెప్పుకొచ్చింది. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. తనకు ట్రావెలింగ్ చేయడమంటే అత్యంత ఇష్టమని.. పనిలో కాస్త విరామం దొరికితే ఎక్కడో ఒక చోటకి టూర్‌కి వెళ్లిపోతానని అంది. తన ట్రావెల్‌ హాబీ ఏ రేంజ్‌లో ఉందో ఇన్‌స్ట్రాగామ్‌ ఫాలోయర్స్‌కి తెలుస్తుందంటూ నవ్వేసింది. చివరిగా బాహుబలి లాంటి సినిమాలో నటించాలని ఏ నటియైనా కోరుకుంటుందని.. బాహుబలి-3 సినిమా తీస్తే అందులో తనకు అవకాశం వస్తే ఆనందంగా చేస్తానని చెప్పింది నిధి అగర్వాల్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu