HomeTelugu Trending'స్టాండప్‌ రాహుల్‌' నుంచి ‘అలా ఇలా అనాలని’ లిరికల్‌ వీడియో

‘స్టాండప్‌ రాహుల్‌’ నుంచి ‘అలా ఇలా అనాలని’ లిరికల్‌ వీడియో

Ala Ila Lyrical Video song
టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. కూర్చుంది చాలు అనేది ఉప శీర్షిక. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు హీరోయిన్‌ వర్ష పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘అలా ఇలా అనాలని’ అనే పాట (లిరికల్‌ వీడియో)ను సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు రౌడీ హీరోవిజయ్‌ దేవరకొండ. అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ మెలొడీ అన్ని వర్గాల శ్రోతల్ని అలరిస్తోంది. సత్య యామిని, స్వీకర్‌ అగస్తి గానం వినసొంపుగా ఉంది. ఈ గీతానికి స్వీకర్‌ అగస్తినే స్వరాలు సమకూర్చారు. రాజ్‌ తరుణ్‌- వర్ష జోడీ కనువిందు చేస్తోంది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్‌, హైఫై పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu