HomeTelugu Trending'స్టాండప్ రాహుల్' న్యూపోస్టర్‌

‘స్టాండప్ రాహుల్’ న్యూపోస్టర్‌

Raj Tarun Birthday Special

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ఈ సినిమాకు ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్ లైన్. టైటిల్ తోనే ఇంటరెస్ట్ కలిగించిన ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈరోజు రాజ్ తరుణ్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ‘స్టాండప్ రాహుల్’ చిత్రబృందం రాజ్ తరుణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్టర్ రిలీజ్ చేసింది. సాంటో మోహన్ వీరంకి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా తాజా పోస్టర్ ఆకట్టుకుంటుంది. రాజ్ తరుణ్ స్మైలింగ్ సైడ్ యాంగిల్ ఫేస్ తో.. జనాల మధ్య నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడుతున్నట్లుగా పోస్టర్ డిజైన్ చేశారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నందకుమార్ అబ్బీనేని, భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కంచరపాలెం ఫేమ్ స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu