పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ.. మహేష్‌ ట్వీట్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సైతం పవన్‌ గురించి ట్వీట్‌ చేశారు. ‘పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి. గెట్ వెల్ సూన్… స్ట్రెంగ్త్ అండ్ ప్రేయర్స్’ అంటూ ట్వీట్ చేశారు.

ఇటీవల తన వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువమంది కరోనా బారిన పడడంతో పవన్‌ కొన్నిరోజుల నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ క్రమంలోనే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొంటూ శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ తంగెళ్ల సుమన్‌ ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కాస్త నిమ్ము చేరడంతో యాంటీ వైరల్‌ మందులతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పవన్ కళ్యాణ్ కోలుకుంటారని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates