HomeTelugu Trendingస్టాండప్‌ రాహుల్‌ ఫస్ట్‌లుక్‌

స్టాండప్‌ రాహుల్‌ ఫస్ట్‌లుక్‌

Raj tarun stand up rahulటాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండ్ అప్ రాహుల్’. `కుర్చుంది చాలు` అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ‘జాను’ ఫేమ్ వర్షా బొల్లమ్మ హీరోయిన్. ఈ చిత్రానికి సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హై ఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్ కుమార్ అబ్బినేని – భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి విషెస్ తెలియజేసింది.

”మైక్ టెస్టింగ్ 1..2..3.. చెక్ చెక్.. రాజ్ తరుణ్ కూర్చుంది చాలు.. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ `స్టాండప్ రాహుల్`. ఔట్ స్టాండింగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని సమంత ట్వీట్ చేసింది. ‘స్టాండ్ అప్ రాహుల్’ ఫస్ట్ లుక్ లో రాజ్ తరుణ్ షార్ట్ – బ్లూ కలర్ టీ షర్ట్ ధరించి కూర్చొని ఉన్నాడు. చుట్టూ మైకులు ఉండగా మెడలో హెడ్ ఫోన్స్ – ఒంటి నిండా కేబుల్స్ చుట్టుకొని దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu