బాలీవుడ్‌లో ‘ఓ బేబీ’ గా ఆలియా!

కొరియన్‌ హిట్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’ కి తెలుగు రీమేక్‌గా వచ్చిన ‘ఓ బేబీ’ మంచి విజయం అందుకుంది. సమంత టైటిల్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లతో రాణిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సురేష్‌బాబు సమర్పించారు. 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువతిగా మారిపోయే కథాంశంతో ‘ఓ బేబీ’ తెరకెక్కింది. లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌, నాగశౌర్య కీలక పాత్రల్లో నటించారు.

కాగా ఇప్పుడు ‘ఓ బేబీ’ ని బాలీవుడ్‌లోనూ తెరకెక్కించాలని సురేష్‌బాబు భావిస్తున్నారట. ఇందులో సామ్‌ పాత్రను ఆలియా భట్‌తో చేయించాలని ప్రయత్నిస్తున్నారట. అయితే ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌, ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్‌ 2’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో రీమేక్‌ తీయడం ఇప్పట్లో సాధ్యం అవుతుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో..!