
Reason behind Alia Bhatt’s absense at Cannes:
ప్రఖ్యాత కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో జరగుతున్న వేళ, అనేక అంతర్జాతీయ సెలబ్రిటీలు రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ఈ ఏడాది అలియా భట్ కాన్స్‌లో హాజరవుతుందని ముందుగా ప్రచారం జరిగింది. కానీ ప్రారంభ వారం ఆమె కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరచింది.
ప్రశ్నలకు సమాధానంగా ఆమె పీఆర్ఎం టీం, “పాకిస్తాన్‌పై ఉన్న జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె తన ప్రెజెన్స్‌ను తాత్కాలికంగా వాయిదా వేసింది,” అని తెలిపింది. ఈ నిర్ణయం దేశం కోసం లాగా ప్రజెంట్ చేశారు. కానీ నెటిజన్లు మాత్రం వేరే కోణంలో ఆలోచిస్తున్నారు.
కంగనా రనౌత్ అభిమానులు చెప్పినట్టు, ఈ సంవత్సరం కాన్స్ కమిటీ “గ్రౌండ్‌ను తాకే పొడవైన గౌన్లు అనుమతించబోమని” నిబంధన జారీచేసిందట. దీనివల్ల అలియాకు మేకప్, కాస్ట్యూమ్ టీంలో సమస్యలు వచ్చాయని, అందుకే ఆమె డ్రెస్ రెడీ కాలేదని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ కారణంతోనే ఆమె తొలివారంలో హాజరుకాలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఇక అసలు కారణం ఏదైనా కావచ్చు. కానీ ఇదంతా ఒక సాకు కావచ్చనే విమర్శలు సోషల్ మీడియాలో వ్యాప్తిలో ఉన్నాయి. అటు చివరి వారం కాన్స్ వేడుకలకు ఆమె హాజరవవచ్చని కొన్ని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంతలో, అఫీషియల్ క్లారిటీ లేకపోయినా, ఈ వివాదం బాలీవుడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారింది. అలా అయితే, ఫైనల్ వీక్‌లో అలియా ఎలాంటి లుక్‌లో కనిపిస్తుందనేది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.
ALSO READ: Raja Saab సినిమాకి కూడా Vishwambhara లాంటి ఇబ్బందులేనా?