HomeTelugu Trendingరాజమౌళితో సినిమా చేయడంపై అలియా భట్‌ స్పందన

రాజమౌళితో సినిమా చేయడంపై అలియా భట్‌ స్పందన

Alia Bhatt 2బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ రాజమౌళిపై ప్రశంసలు కురించింది. రాజమౌళితో పని చేయడం అంటే స్కూలుకు వెళ్లడంతో సమానమని అన్నారు. ఆయనో మాస్టర్ స్టోరీ టెల్లర్ అని చెప్పుకొచ్చారు. టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీల వ్యక్తుల జాబితాలో రాజమౌళి, షారుక్ ఖాన్ చోటు దక్కించుకున్నారు.

ఈ నేపథ్యంలో మీడియాతో అలియా భట్ మాట్లాడుతూ.. రాజమౌళిని మొదటిసారి ‘బాహుబలి’ ప్రీమియర్ లో కలిశానని, సినిమా చూస్తున్నంతసేపు ఆశ్చర్యపోయానని చెప్పారు. ఎలాగైనా ఆయన డైరెక్షన్‌లో నటించాలని అనుకున్నానని, ‘ఆర్ఆర్ఆర్’తో అది నెరవేరిందని చెప్పారు.

Alia Bhatt talk about Rajam

‘రాజమౌళి దగ్గర పని చేయడం అంటే స్కూలుకు వెళ్లడంతో సమానం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మరెన్నో కొత్త అంశాలు తెలుసుకోవచ్చు. ఆయన ఒక కథను అద్భుతంగా తెరకెక్కించగలరు. తన సినిమాల ద్వారా అందరినీ ఒక చోటుకు చేర్చుతారు’ అని వ్యాఖ్యానించింది.

‘నటన పరంగా ఏదైనా సలహా ఇవ్వమని అడిగాను. ‘ఏ క్యారెక్టర్ లో నటించినా.. ప్రేమతో చేయాలి’ అని రాజమౌళి చెప్పారు. సినిమా పెద్దగా ఆడకపోయినా.. మనం చేసిన పాత్ర జనాలకు గుర్తుండిపోయేలా నటించాలని సూచించారు’ అని వివరించారు అని చెప్పింది.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu