HomeTelugu Trending'బంగారు బుల్లోడు' ట్రైలర్‌

‘బంగారు బుల్లోడు’ ట్రైలర్‌

Allari Naresh Bangaru Bull
అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బంగారు బుల్లోడు’. పి.గిరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఏ టీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించాడు. పూజా జవేరి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయడం కోసం ఇన్నాళ్ళు వేచి చూసిన మేకర్స్.. జనవరి 23న ‘బంగారు బుల్లోడు’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

ఈ చిత్రంలో అల్లరి నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించినట్లు తెలుస్తోంది. తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, ప్రవీణ్, పృథ్వీ రాజ్, సత్యం రాజేష్, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను,తదితరులు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!