ఆర్య, సాయేషా సంగీత్‌లో అల్లు అర్జున్‌ సందడి

తమిళ హీరో ఆర్య, సాయేషా సైగల్‌ వివాహ బంధంతో ఆదివారం ఒక్కటి కాబోతున్నారు. ప్రీ వెడ్డింగ్‌లో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో సంగీత్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాబోయే వధూవరులు తెలుపు వర్ణం దుస్తుల్లో అందంగా మెరిశారు. అల్లు అర్జున్‌ సంగీత్‌లో పాల్గొని ఆర్య, సాయేషాకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సంగీత్‌లో తన ప్రేయసితో కలిసి దిగిన ఫొటోలను ఆర్య ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా, నీ చేయి విడువను అనే అర్థంతో ట్వీట్‌‌ చేశారు. ఇవే ఫొటోలను సాయేషా కూడా అభిమానులతో పంచుకున్నారు. ‘మై లవ్‌ ఫరెవర్‌’ అని కాబోయే భర్తపై ఉన్న ప్రేమను తెలిపారు.

‘గజినీకాంత్‌’ (2018) సినిమా కోసం ఆర్య, సాయేషా ఇద్దరు ప్రేమలో పడ్డారు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ.. వివాహం వైపు నడిపించింది. ప్రస్తుతం సాయేషా కోలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం సూర్య హీరోగా చేస్తున్న కాప్పన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్య కూడా కాప్పన్ సినిమాలో ఓ కీలకమైన రోల్ చేస్తున్నాడు.