ఆ చిత్రం కోసం.. మొహం చాటేస్తున్న అల్లు అర్జున్‌.!


స్టైలీష్ స్టార్‌.. అల్లు అర్జున్ బయట కనిపించింది లేదు. ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. మరో 15 రోజుల్లో త్రివిక్రమ్ సినిమా నుంచి పూర్తిగా ఫ్రీ కానున్నాడు. జనవరి 12న విడుదల కానుంది అల వైకుంఠపురములో. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు బన్నీ.

ఈ చిత్రం కోసమే తనను తాను మార్చుకుంటున్నాడు అల్లు వారబ్బాయి. ఈ చిత్రం అంతా సింహాచలం అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇందులో బన్నీ పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతుందని.. ఆ పాత్రకు పడిపోయి బన్నీ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం షూటింగ్ మొదలవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. దాంతో ఇప్పట్నుంచే అజ్ఞాతంలోకి వెళ్లబోతున్నాడు బన్నీ. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇందులో స్మగ్లర్ పాత్రలో నటించబోతున్నాడు అల్లు అర్జున్. దాంతో దీనికోసం కొత్త లుక్ ప్లాన్ చేస్తున్నాడు బన్నీ.

అందుకే ఈ లుక్ బయటికి రాకుండా ఉండటానికి ఈయన కనిపించకుండా వెళ్తున్నాడు. మళ్లీ షూటింగ్ సమయానికి నేరుగా మీడియా ముందుకు వస్తాడని తెలుస్తుంది. అప్పటి వరకు ఈ సస్పెన్స్ మాత్రం తప్పకపోవచ్చు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ జోడీగా రష్మిక మందన్న నటించబోతుంది.. ఇక జబర్దస్త్ యాంకర్ అనసూయ మరో కీలక పాత్రలో నటించబోతుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తున్నారు. రంగస్థలం తర్వాత సుకుమార్ తెరకెక్కించబోయే సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికితోడు ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఇది.

CLICK HERE!! For the aha Latest Updates