HomeTelugu Trendingతెలుగు హీరోగా చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్

తెలుగు హీరోగా చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్

Allu arjun creates history
తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు దక్కించుకున్న తొలి నటుడిగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. 2021కు గాను జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పుష్ప సినిమాలో నటనకుగాను బన్నీ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కించుకున్నాడు.

పుష్ప సినిమాకు సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్‍కు కూడా జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా (పాటలు) అవార్డు దక్కింది. దీంతో పుష్ప టీమ్‍తో పాటు తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్‍కు అభినందనలు తెలుపుతున్నారు. అల్లు అర్జున్‍కు కంగ్రాట్స్ చెబుతూ సినీ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. కంగ్రాట్యులేషన్స్ అల్లు అర్జున్ బావా.. పుష్ప మూవీ కోసం నీవు అన్ని విజయాలకు, అవార్డులకు అర్హుడవు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

బన్నీ ఇంటి వద్ద సంబరాలు మిన్నంటాయి. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ వచ్చి అల్లు అర్జున్‍ను గట్టిగా కౌగిలించుకున్నారు. ఎమోషనల్ అయి చాలా సేపు అలాగే ఉండిపోయారు. పుష్ప చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ కూడా హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఇంట్లో పుష్ప టీమ్ సంబరాలు చేసుకున్న వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.

బన్నీ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల డ్యాన్సులు చేస్తూ, కేక్‍లు కట్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఫేవరెట్ ఐకాన్ స్టార్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!