బన్నీ కూతురు ఫన్నీ వీడియో.. వైరల్‌


టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినసరం లేదు. తన ముద్దు ముద్దు మాటలతో తరచు సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది ఈ పాప. నాలుగేళ్లవయసులోనే తన మాటలు, చేష్టలతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా అర్హకు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్‌ మీడియావైరల్‌గా మారింది. అందులో ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు అని అడగ్గా మొదట జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అని చెప్పిన అర్హ.. దాని స్పెల్లింగ్‌ చెప్పమంటే మాత్రం లేదు లేదు..నా ఫేవరెట్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ అంటూ మాట మార్చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను స్నేహరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది.

 

CLICK HERE!! For the aha Latest Updates