అల్లు అర్జున్‌కు కేరళ ప్రభుత్వ ఆహ్వానం

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌కు ముఖ్య అతిథిగా హాజరు కావ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ పోటీలు ఈ నెల 10న అలప్పుల సమీపంలోని పున్నంద సరస్సులో జరగనున్నాయి. ఇక కేరళ ప్రభుత్వ ఆహ్వానంపై బన్నీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక బన్నీకి కేరళలో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే.

కేరళలో బన్నీ సినిమాలు మంచి కలెక్షనను రాబడతాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ను కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇక ఈ గౌరవం పొందిన తొలి టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం. కాగా ఈ ఏడాది ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’తో వచ్చిన బన్నీ.. తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.