కరుణాకరణ్ తో మెగాహీరో!

సాయి ధరం తేజ్ ప్రస్తుతం బివిఎస్ రవి దర్శకత్వంలో ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, దానికి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తేజు రెండు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. సి.కల్యాణ్ నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అవ్వగా, తాజాగా యూత్ ఫుల్ డైరెక్టర్ కరుణాకరన్ తో కలిసి పని చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. తొలిప్రేమ, డార్లింగ్ వంటి హిట్ సినిమాలు కరుణాకరన్
లిస్ట్ లో ఉన్నా.. అదే రేంజ్ లో ఫ్లాప్ లు కూడా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో ఆయన నుండి ఒక్క హిట్టు సినిమా కూడా రాలేదు. దీంతో మరోసారి తనదైన స్టయిల్ లో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీను సిద్ధం చేసుకొని సాయి ధరం తేజ్ కు వినిపించినట్లుగా తెలుస్తోంది. కథ నచ్చడంతో ఈ యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అయితే వినాయక్, కరుణాకరన్ ఈ ఇద్దరి చిత్రాల్లో ఎవరి సినిమా ముందుగా సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.