1వ తేదీన బన్నీ అన్ని విషయాల్ని ప్రకటిస్తాడట..!

స్టాలీష్ స్టార్‌ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమా తరువాత ఇప్పటి వరకు కొత్త సినిమా ప్రకటించాలేదు. బన్నీ ఈసారి సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి చాలా సమయమే తీసుకున్నారు. చాలా కథలు విన్న ఆయన పలువురి దర్శకులతో చర్చలు జరిపి చివరికి రెండు కథల్ని ఓకే చేసుకున్నారట. అయితే కథలు ఏమిటి, దర్శకులు ఎవరు అనే విషయాల్ని జనవరి 1వ తేదీన ప్రకటిస్తారట. మరి బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.