‘వినయ విధేయ రామ’ నుంచి ‘తస్సాదియ్యా..’ సాంగ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘తందానే తందానే..’ పాటకు మంచి స్పందన లభించింది.

కాగా తాజాగా ఈ సినిమాలో చరణ్‌, కైరా మధ్య సాగే ‘తస్సాదియ్యా..’ డ్యుయెట్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ‘రోమియో, జూలియట్‌ మళ్లీ పుట్టినట్లు ఉంటాదంట మన జట్టు, వాళ్ల కథలో క్లైమాక్స్‌ పాజిటివ్‌గా రాసినట్లు మన లవ్‌ స్టోరీ హిట్టు..’ అని సాగే ఈ పాట ఆకట్టుకుంటోది.

స్నేహా, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, అనన్య, ఆర్యన్‌ రాజేష్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ భామ ఈషా గుప్తా ఇందులోని ప్రత్యేక గీతంలో నటిస్తున్నారు. యాక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.