బన్నీ త్రివిక్రమ్‌ల మూవీ టైటిల్‌ ఇదేనా?

అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించినా సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది. ఎప్పటి నుంచి సినిమా ప్రారంభం అవుతుందనే విషయాలు బయటకు రావడం లేదు. మార్చి చివర్లో సినిమా ప్రారంభం అవుతుందని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని పక్కనపెడితే.. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి ఓ న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల టైటిల్స్ చాలా కొత్తగా ఉంటాయి. తెలుగు పేర్లను పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు త్రివిక్రమ్. అత్తారింటిది దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ.. ఇలా ఏ పేరు తీసుకున్నా చాలా కొత్తగా ఉంటుంది. ఇలా కొత్తగా ఉండే పేరునే అల్లు అర్జున్ సినిమాకు కూడా అనుకున్నారని టాక్. ‘నాన్న నేను’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తండ్రి సెంటిమెంట్ కథతో కూడిన సినిమా కాబట్టి టైటిల్ ఇదే బాగుంటుందని మూవీయూనిట్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.