చిన్నోడి డైరెక్టర్ తో బన్నీ!

‘టైగర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయిన వి.ఐ.ఆనంద్ ఇటీవల ‘ఎక్కడకి పోతావు చిన్నవాడా’ సినిమాతో కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మన హీరోలందరి దృష్టి ఆనంద్ పై పడింది. ప్రస్తుతం ఆనంద్, అల్లు శిరీష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బేసిక్ గా ఆనంద్ అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. టైగర్ సినిమా సమయంలోనే బన్నీ కోసం కథ కూడా సిద్ధం చేశాడట. కానీ అతడికి వినిపించే ఛాన్స్ దొరకలేదు.

రీసెంట్ గా బన్నీను కలిసి తను అనుకున్న కథ లైన్ వినిపించాడట. బన్నీకు ఆ లైన్ విపరీతంగా నచ్చినట్లు తెలుస్తోంది. ఇదో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో నదించే కథ అని సమాచారం. అయితే ఆనంద్, అల్లు శిరీష్ కు హిట్ ఇస్తేనే బన్నీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు శిరీష్ తో చేయబోయే సినిమా కూడా ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ నెలలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.