‘బోస్’ పవన్ కోసమేనా?

గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ హీరోగా దాసరి నారాయణరావు ఓ సినిమా నిర్మించబోతున్నాడనే
మాటలు వినిపించాయి. పవన్ పుట్టినరోజు నాడు ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా
చేశారు. అయితే డైరెక్టర్ ఎవరనే విషయంపై క్లారిటీ రాలేదు. ముందుగా పవన్ కమిట్ అయిన
సినిమాలన్నింటినీ పూర్తి చేసి దాసరి నిర్మాణంలో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజాగా దాసరి సొంత బ్యానర్ అయిన తారకప్రభు ఫిలిమ్స్ పై ‘బోస్’ అనే టైటిల్ ను రిజిస్టర్
చేయించారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ అనేది ఉపశీర్షిక. ఇది పవన్ సినిమా కోసమే అనే మాటలు
వినిపిస్తున్నాయి. టైటిల్ ను బట్టి ఇది దేశభక్తి చిత్రంగా అనిపిస్తోంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్
పైకి వెళ్తుందా..? అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.