అన్న బార్ లో తమ్ముడి వంట!

హీరో అల్లు శిరీష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలకు సంబందించిన ఫోటోలను సైతం తరచూ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. లేటెస్ట్ గా అల్లుశిరీష్ తాను వంటచేస్తున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైపు రకరకాల బిజినెస్ లు ప్రారంభిస్తున్న విషయంతెలిసిందే. ఈనేపధ్యంలో బన్నీ ఈమధ్య జూబ్లీహిల్స్ లో ఒక బార్ ఓపెన్ చేశాడు. 

రీసెంట్ గా ఈ బార్ ను సందర్శించిన శిరీష్ కిచెన్ రూంలోకి వెళ్లి వంటలో తనకున్న ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు అల్లు శిరీష్ చికెన్ వింగ్స్ తయారు చేసి ఇదిగో ఇలా సిద్ధమైందంటూ మెగా అభిమానులందరికీ నోరు ఊరించేలా గ్రేట్ ఫుడ్ అంటూ తన వంటకు తానే బిరుదు ఇచ్చుకుని ఆ ఫోటోను అభిమానులకు షేర్ చేసాడు.