విజయ్ ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా!

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన అమలాపాల్ 23 ఏళ్ళకే దర్శకుడు విజయ్ ను వివాహమాడింది. ఒక హీరోయిన్ ఆ వయసులోనే పెళ్లి చేసుకోవడం ఓ సంచలనం అయితే పెళ్ళైన రెండేళ్లకే అతడి నుండి విడిపోతున్నట్లు కటించడం మరొక సంచలనం. భర్త నుండి వేరుపడ్డ అమల సినిమాల మీద ఫోకస్ పెట్టింది. హాట్ ఫోటో షూట్స్, హాలిడే ట్రిప్స్ తో తరచూ వార్తలో నిలుస్తుంది.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ మీద కొన్ని కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. విజయ్ అతడి కుటుంబ సభ్యులు పెట్టే నిబంధనల కారణంగానే ఆమె విజయ్ నుండి విడిపోయిందని అందరూ అనుకున్నారు.. అయితే అటువంటి విజయ్ గురించి అమల పాజిటివ్ గా స్పందించడం అతడిపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది.
 
”విజయ్ ను నేను ఎప్పటికీ.. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. అతడితో విడిపోవాలన్న నిర్ణయం నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయం. ఈ పరిణామాలు నా జీవితంలో పాఠాలు” అంటూ వ్యాఖ్యానించింది.