పద్మావతికి పాతిక కోట్ల బంపర్ ఆఫర్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే నటిస్తోన్న తాజా చిత్రం ‘పద్మావతి’. లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకముందెన్నడూ.. చూడని విధంగా ట్రైలర్ లో విజువల్స్ ఉన్నాయి.

ట్రేడ్ వర్గాల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ సంస్థ పాతిక కోట్లు పెట్టి డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన తరువాత వచ్చిన స్పందనను బట్టీ డిజటల్ హక్కులు తీసుకోవడం సాధారణమే.

కానీ విడుదలకు ముందే ఇంత పెట్టుబడి పెట్టి హక్కులు దక్కించుకోవడాన్ని బట్టి సినిమాకు ఎంత క్రేజ్ ఉందో.. తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హక్కులు రెండు వందల కోట్లకు పలుకుతున్నట్లు సమాచారం.