అంబానీ కొడుకుతో కత్రినా డేటింగ్..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గతంలో హీరో రణ్‌బీర్‌ ను ప్రేమించడం, వారిద్దరికి బ్రేకప్
అయిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు మరోసారి తన ప్రేమ వ్యవహారంతో వార్తల్లోకెక్కింది
ఈ బ్యూటీ. రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీతో
కత్రినా డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఇటీవల జరిగిన దీపావళి
పండగకి గానూ.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన ఇంట్లో గ్రాండ్ గా ఓ పార్టీ నిర్వహించి అన్ని
రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. ఈ పార్టీకు ఆకాష్ అంబానీ, కత్రినా కైఫ్
కలిసి ఒకే కార్ లో వచ్చారట. ఆ తర్వాత వీరిద్దరు కలిసి అనిల్ కపూర్ ఇంట్లో పార్టీకు కూడా
హాజరయినట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీకు కత్రినా మాజీ ప్రేమికుడు రణ్‌బీర్‌ కూడా కూడా
వచ్చాడని సమాచారం.