కూతురి ర్యాంప్ వాక్ చూసి మురిసిపోయిన అమితాబ్‌

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు కుమార్తె శ్వేత అంటే అపారమైన ప్రేమ. అభిషేక్‌ కంటే ఎక్కువ ప్రేమ ఆయనకు శ్వేతపై ఉంది. ఈ విషయం ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్‌ వేడుకలో మరోసారి రుజువైంది. ఇటీవల ముంబయిలో క్యాన్సర్‌ రోగుల కోసం విరాళాలు సేకరించేందుకు ఓ ఫ్యాషన్‌ షోను ఏర్పాటుచేశారు. ఈ షోలో శ్వేత అబూ జానీ సందీప్‌ ఖోస్లా డిజైన్‌ చేసిన దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేశారు. అయితే శ్వేత ర్యాంప్‌ వాక్‌ చేస్తున్నప్పుడు ఆడియన్స్‌ మధ్యలో కూర్చున్న అమితాబ్‌ తన ఫోన్‌లో వీడియో తీస్తూ విజిల్స్‌ వేశారు. అంతేకాదు అక్కడున్న ఫొటోగ్రాఫర్లు అడ్డుగా ఉన్నారని పక్కకు జరగండి అంటూ వారికి సైగలు చేశారు.

అలా కుమార్తె ర్యాంప్‌ వాక్‌ చేస్తున్నప్పుడు అమితాబ్ మురిసిపోవడం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. ఆ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. శ్వేత ర్యాంప్‌ వాక్‌ చేస్తున్న ఫొటోను అమితాబ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. కుమార్తెలు ఎప్పుడూ బెస్టే. శ్వేతా.. మొన్నే నీ చెయ్యి పట్టుకుని నడక నేర్పించినట్లుంది. ఈరోజు నువ్వే నడిచేస్తున్నావ్‌ (ర్యాంప్‌ వాక్‌ను ఉద్దేశిస్తూ). రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలీడంలేదు అని పేర్కొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates