రామ్‌చరణ్‌ కు అమితాబ్ బర్త్‌డే గిఫ్ట్‌ ఇదే.. చేతులు వణికిపోతున్నాయ్‌ సర్‌..అంటున్న ఉపాసన

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఈరోజు తన 34వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌.. చెర్రీకి ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న వీడియోను ట్విటర్లో పోస్ట్‌ చేశారు. ‘చరణ్‌.. దిస్‌ ఈజ్‌ అమితాబ్‌.. ఈరోజు నీ పుట్టినరోజు. ఆల్‌ ది బెస్ట్‌. మున్ముందు నువ్వు చేసే పనిలో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాను. నా నుంచి, నా ముంబయి కుటుంబం నుంచి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. నువ్వు వండర్‌ఫుల్‌ వ్యక్తివి. నీ వయసెంతో నాకు తెలీదు కానీ.. నిన్ను చూసిన ప్రతిసారీ నీకు 18 ఏళ్లే ఉంటాయోమో అనిపిస్తుంటుంది. మీ మాతృభాషలోనే నీకు విష్‌ చేస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు అమితాబ్‌. ఈ వీడియోను చరణ్‌ సతీమణి ఉపాసన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇంత చక్కటి సందేశం పంపించినందుకు ధన్యవాదాలు బచ్చన్‌ సర్. ఇది నిజంగా స్వీటెస్ట్‌ గిఫ్ట్‌. నా చేతులు ఇప్పటికీ వణుకుతున్నాయ్‌. చాలా ఆత్రుతగా ఉంది. హ్యాపీ బర్త్‌డే చరణ్‌. లవ్యూ’ అని పేర్కొన్నారు. మెగా ఫ్యామిలీకి, అమితాబ్‌ కుటుంబానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. చరణ్‌ నిర్మిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అమితాబ్‌ కీలక పాత్ర పోషించారు.

CLICK HERE!! For the aha Latest Updates