బాలయ్య సినిమాలో అమితాబ్ లేనట్లే..!

నందమూరి బాలకృష్ణ, కృష్ణవంశీ కాంబినేషన్ లో ‘రైతు’ అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో కృష్ణవంశీ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో బిగ్ బి అమితాబ్ అయితే పెర్ఫెక్ట్ అని భావించిన చిత్రబృందం ఈ విషయమై ఆయనను సంప్రదించారు.

బాలకృష్ణ స్వయంగా ముంబై వెళ్ళి అడగడంతో అమితాబ్ తన డైరీ చూసి ఏ విషయం చెబుతానని అన్నారట. దీంతో కృష్ణవంశీ అమితాబ్ కు తగ్గట్లు కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారట. అలా కథలో మార్పులు చేయడం బాలయ్యకు నచ్చక కృష్ణవంశీకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయినా సరే కృష్ణవంశీ రిస్క్ తీసుకొని కథ రెడీ చేశారు. ఫైనల్ గా అమితాబ్ తో డేట్స్ విషయం ప్రస్తావించగా.. ఇప్పట్లో తను సినిమా కోసం డేట్స్ కేటాయించలేనని వచ్చే ఏడాది జూలై వరకు బిజీ అని చెప్పేసారట. అప్పుడు కూడా సర్ధుబాటు చేసుకొని కొన్ని రోజులు రాగలనని అనడంతో ఇక మరో ఆప్షన్ కోసం దర్శకనిర్మాతలు చూస్తున్నారని సమాచారం.