ఎమీజాక్సన్ ప్రేమలో పడింది!

తెలుగులో ఎవడు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయిన ఎమీ జాక్సన్ ఆ తరువాత
తమిళ చిత్రాలతో బిజీగా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ నుండి కూడా అమ్మడుకి
తెగ ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా అమ్మడు ప్రేమలో పడిందనే
మాటలు వినిపిస్తున్నాయి. తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ తనకు
సమయం దొరికినప్పుడల్లా తన ప్రేమికుడితో చెట్టపట్టాలేసుకొని తిరుగుతుందని
తెలుస్తోంది. ఉపేన్ పటేల్ మోడల్ గా, యాక్టర్ గా అందరికీ సుపరిచితుడే. ఈయనగారితోనే
అమ్మడు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట. రీసెంట్ గా ఇద్దరు కలిసి ముంబైలో
ఓ హోటల్ లో డిన్నర్ చేస్తూ కెమెరా కంట పడ్డారు. దీంతో ఈ వార్తలకు మరింత
బలం చేకూరింది. మరి ఈ వార్తలపై ఈ జంట రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి!