
Sumanth Anaganaga Movie Review:
సుమంత్ అంటేనే ఆలోచించే సినిమాలు తీసే హీరోగా పేరుంది. మళ్ళీ రావా తరవాత మళ్లీ ఎమోషనల్ పాత్రలో కనిపించడమే కాదు, ఓ మంచి సందేశం ఉన్న కథతో అనగనగా అనే ఓటీటీ సినిమా చేసాడు. ఈ సినిమా ఇప్పుడు ETV Win లో స్ట్రీమింగ్ అవుతుంది.
కథ:
వ్యాస్ (సుమంత్) అనే స్కూల్ టీచర్ సంప్రదాయ బోధన విధానాన్ని అసహ్యించుకుంటూ, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్‌కి ప్రాధాన్యం ఇస్తాడు. కానీ అతని భార్య భాగ్య (కాజల్ చౌదరి), అదే పాఠశాలలో ప్రిన్సిపల్‌గా ఉంటూ, మార్కులకే విలువ ఇస్తుంది. ఈ గొడవ మధ్య వ్యాస్ కొడుకు రామ్ ఫెయిల్ అవ్వడం, తరువాత స్కూల్ నుంచి వ్యాస్‌ను తొలగించడమే ప్రధాన మలుపు. ఇక ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది సినిమా కథ.
నటీనటులు:
సుమంత్ పాత్రకి మాస్ అప్పీల్ లేకపోయినా, హృదయాన్ని తాకే విధంగా చేశాడు. ఆయన చూపించిన బాధ, తండ్రిగా బాధపడే సన్నివేశాల్లో ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యింది. కాజల్ చౌదరి, కొత్తదే అయినా స్కూల్ ప్రిన్సిపల్ పాత్రలో బాగా ఇమిడిపోయింది. చిన్న పిల్లవాడు విహర్ష్ కూడా నచ్చేలా నటించాడు. అవసరాల శ్రీనివాస్ పాత్ర చిన్నదే అయినా గమనించదగ్గది.
సాంకేతిక అంశాలు:
చందు రవి సంగీతం మృదువుగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ముఖ్యమైన సన్నివేశాల్లో బాగా వర్కౌట్ అయ్యింది. పావన్ పప్పుల సినిమాటోగ్రఫీతో స్కూల్ వాతావరణాన్ని సహజంగా చూపించారు. ఎడిటింగ్ మాత్రం మొదటి భాగంలో కొంచెం బోరుగా అనిపించేలా ఉంది. కొద్ది సన్నివేశాలు కత్తిరించుంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
*సుమంత్ నటన
*తండ్రి-కొడుకు భావోద్వేగాల ప్రదర్శన
*విద్యా వ్యవస్థపై సున్నితమైన విమర్శలు
*ఆకట్టుకునే స్కూల్ వాతావరణం
మైనస్ పాయింట్స్:
-కథలో నూతనత కొరత
– నెమ్మదిగా నడిచే నరేటివ్
– సిస్టమ్ తో ఫైటింగ్ ఎలిమెంట్ బలహీనంగా ఉంది
తీర్పు:
ఓ సామాజిక అంశాన్ని అందంగా చెప్పే ప్రయత్నమే అనగనగా. కొత్తదనం లేకపోయినా, సున్నితమైన భావోద్వేగాలు, మంచి సందేశంతో ఓ మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు. సుమంత్ అభిమానులకు, భావోద్వేగ కథల్ని ఇష్టపడేవారికి ఓటీటీలో చూడదగ్గ చిత్రం.
రేటింగ్: 3/5