
పరశురామ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. మే 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. మంచి కలెక్షన్లు రాబడుతూ.. మహేష్ బాబు కెరీర్‌లో మరో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. అందరికీ అప్పులు ఇస్తూ.. వడ్డీలు వసూలు చేసే క్యారెక్టర్‌లో మహేష్ అద్భుతంగా నటించాడు.
ఇదిలా ఉంటే ఈ చిత్రంపై ప్రముఖ ఆటోమోబైల్ మహీంద్ర గ్రూప్ అధినేత `సర్కారు వారి పాట గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.. అనుపమ్ తరేజా చేసిన పోస్ట్ కి ఆనంద్ మహీంద్ర రియాక్ట్ అయ్యారు. `సర్కారు వారి పాట` సినిమాని కచ్చితంగా చూస్తానని తెలిపారు… మరి ఇంతక అనుపమ్ తరేజా ఏం పోస్ట్ చేశారంటే, `సర్కారు వారి పాట` చిత్రంతో మహేష్‌బాబు `జావా మెరూన్ అనే ఖరీదైన బైక్‌ని వాడతారు. మహేష్, జావా కాంబినేషన్ అద్భుతంగా ఉందని, సినిమా సక్సెస్‌లో భాగమైందని, సినిమా సక్సెస్‌తో దేశ వ్యాప్తంగా మహేష్ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, ఈ సినిమాని చూడాలని ఆయన ట్వీట్ చేశారు.
How can I miss watching the unbeatable combination of @urstrulyMahesh and Jawa? I’m in New York & will go out to New Jersey where it’s being screened… #SarkaruVaariPaata, #JawaMaroon https://t.co/ytc5pPQbl1
— anand mahindra (@anandmahindra) May 29, 2022













