HomeTelugu Trendingటీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు తప్పు ట్వీట్ చేసి క్షమాపణ చెప్పిన అనసూయ

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు తప్పు ట్వీట్ చేసి క్షమాపణ చెప్పిన అనసూయ

2 12యాంకర్, నటి అనసూయ పొరపాటునా ఓ తప్పు చేసింది.. ఆ తర్వాత తన తప్పును గుర్తించి.. సదరు నేతకు క్షమాపణలు చెప్పింది.. ఇంతకీ అనసూయ క్షమాపణలు చెప్పాల్సినంత తప్పు ఏంటి చేసిందబ్బా? అనే మీ డౌటా? అయితే వివరాల్లోకి వెళ్దాం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించింది ఉంది నల్లమల్ల ఫారెస్ట్… కొన్ని ప్రాంతాల్లో అయితే దట్టమైన ఈ అడవుల్లో అడుగు పెట్టడం కూడా కష్టమే.. ఎన్నో రకాల వన్యప్రాణులు, లక్షలాది వనమూలికలు, కోట్లాది మొక్కలకు పుట్టినిల్లు నల్లమల్ల అటవీ ప్రాంతం. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం కన్నేసింది.. నల్లమలలో యురేనియం తవ్వకాలను చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. మరోవైపు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయానికి అభ్యంతరం తెలపడంలేదు.. అయితే, ప్రకృతి ప్రేమికులు, ప్రజాసంఘాలు, శాస్త్రవేత్తలు, సినీ ప్రముఖులు ఇలా పెద్ద ఎత్తున ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్యమంలో యాంకర్ అనసూయ కూడా భాగమైపోయారు.

సేవ్ నల్లమల యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది.. దీంట్లో పాలుపంచుకున్న అనసూయ.. యురేనియం ప్రాజెక్టు వద్దంటూ ట్విట్టర్‌లో స్పందించారు. తన అభిప్రాయాన్ని తెలుగు రాష్ట్రాలకు చెందిన అటవీశాఖ మంత్రులకు ట్యాగ్ చేయాలని భావించింది. పనిలో పనిగా ఏపీ అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ట్యాగ్ చేసిన అనసూయ.. ఆ తర్వాత తెలంగాణ అటవీ శాఖ మంత్రి విషయంలో పొరపాటు పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన.. ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు ట్యాగ్ చేసింది. అయితే, టీఆర్ఎస్ 2 ప్రభుత్వంలో జోగు రామన్న మంత్రి పదవి కోల్పోగా.. ప్రస్తుతం ఆ బాధ్యతలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చూస్తున్నారు. ఇక, టీఆర్ఎస్ రెండోసారి గెలిచిన తర్వాత మంత్రి పదవి ఆశించిన జోగు రామన్నకు కేసీఆర్ షాక్ ఇచ్చారు.. అయితే, కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ఆశించిన రామన్నకు మళ్లీ భంగపాటు తప్పలేదు. అసలే మంత్రి పదవి రాలేదని.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని వార్తలు వస్తున్న సమయంలో అనసూయ ఆయనకు ట్యాగ్ చేసింది… దీంతో ఆమె ట్వీట్‌కు కామెంట్లు వస్తుండడంతో అసలు విషయాన్ని గుర్తించిన అనసూయ. “క్షమించండి.. నాకు తెలీదు!.. ‘జోగురామన్న అటవీ మంత్రి అని ట్యాగ్ చేసినందుకు క్షమించండి. కరెంటు అఫైర్స్ గురించి నాకు పెద్దగా తెలీదు.. పట్టులేదు కూడా లేదు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుపై ఆలోచించండి” అని మరో ట్వీట్ చేస్తూ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ట్యాగ్ చేశారు అనసూయ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu