HomeTelugu Big Stories'బిగ్‌బాస్‌ 4 'లో అనసూయ!

‘బిగ్‌బాస్‌ 4 ‘లో అనసూయ!

1 14
తెలుగు ‘బిగ్ బాస్’ షో.. ఇంతవరకూ 3 సీజన్లు జరిగాయి. ఈ మూడు సీజన్లకు ఎన్టీఆర్ .. నాని .. నాగార్జున హోస్టులుగా వ్యవహరించారు. కొంతకాలంగా సీజన్ 4 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సీజన్ కోసం ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా యాంకర్‌ అనసూయను కూడా ఈ షో నిర్వాహకులు సంప్రదించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

గత సీజన్లో యాంకర్ శ్రీముఖిని ఎంపిక చేసుకున్న నిర్వాహకులు ఆమెకి ఎపిసోడ్ కి లక్ష రూపాయలను చెల్లించినట్టుగా చెప్పుకున్నారు. ఆ లెక్కన చూసుకుంటే అనసూయకు అంతకంటే ఎక్కువనే ఇవ్వవలసి ఉంటుంది. అందువలన షో నిర్వాహకులు భారీ మొత్తమే ఆఫర్ చేశారట. అయినా అనసూయ ఆసక్తిని చూపలేదని అంటున్నారు. అంతకాలం పాటు తాను ఫ్యామిలీకి దూరంగా ఉండలేనని ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని చెబుతున్నారు. ఇక ఒక వైపున టీవీ షోలతోను.. మరో వైపున సినిమాలతోను అనసూయ బిజీగా ఉండటం కూడా ఆమె ‘నో’ చెప్పడానికి కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu